ముంబై: బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మెహిందీ సెర్మనీలో ఆలియా ధగధగలాడే లెహంగా వేసుకున్నది. ఆ పింక్ మెరపుల లెహెంగాను మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. గోల్డ్, సిల్వర్ చమక్కులతో రూపొందిన ఆ డ్రెస్సులో ఆలియా తెగ మెరిసిపోయింది. రణ్బీకర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా.. మెహిందీ ఈవెంట్‌కు పింక్ లెహెంగాలో ముస్తాబైంది. ఆ డ్రెస్సులో ఉన్న ఎంబ్రాయిడరీ చాలా క్లిష్టమైంది. ఎంతో ఆకర్షణీయంగా ఆ డ్రెస్సును డిజైన్ చేశారు. దానిపై సుమారు 180 టెక్స్టైల్స్ ప్యాచ్‌లు ఉన్నట్లు డిజైనర్లు తెలిపారు. కశ్మీరీ, చికంకారీ నూలుతో ఆలియా మెహిందీ లెహెంగాను తయారు చేశారు. దీని కోసం సుమారు మూడు వేల గంటల పాటు మిజ్వాన్ మహిళలు శ్రమించినట్లు డిజైనర్ మనీశ్ తెలిపారు. అంటే ఈ లెహెంగా కోసం 125 రోజులు కష్టపడినట్లు తెలుస్తోంది. చేతితో నేసిన ఆ సిల్క్ డ్రెస్సులో.. బనారసీ, జాక్వార్డ్, బంధనీ, కచ్చా రేషమ్ వర్క్ కూడా ఉంది.