ప్రేమకంటే గొప్ప యుద్ధం లేదు
రాయలసీమ విలేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్'తో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు అక్కినేని అఖిల్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
రాయలసీమ విలేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’తో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు అక్కినేని అఖిల్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. సామాజికాంశాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో తన వారిని, ప్రేమను గెలిపించుకోవడానికి ప్రతీపశక్తులతో యుద్ధం చేసే యువకుడిగా అఖిల్ కనిపిస్తారని సమాచారం. తాజాగా ‘పెద్ది’ ప్రదర్శిస్తున్న థియేటర్లలో ‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో ఓ పాటను చూపిస్తున్నారు. ఇందులో నాయకానాయికలు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. ‘ప్రేమకంటే గొప్ప యుద్ధం లేదు’అనే క్యాప్షన్‌తో తమన్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో, సంగీతం: తమన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, రచన-దర్శకత్వం: మురళీకిషోర్ అబ్బూరు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

