బాలయ్య ఓ పవర్‌హౌస్!

బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘అఖండ’ చిత్రంలోని పోరాటఘట్టాలు ప్రేక్షకుల్ని రొమాంచితుల్ని చేస్తున్నాయి. ఇప్పటివరకు చూడని కొత్త ఎలివేషన్స్‌తో యాక్షన్ ఎపిసోడ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఫైట్ మాస్టర్స్‌గా పనిచేసిన స్టన్ శివ..ఆయన కుమారులు కెవిన్, స్టీవెన్ ఆదివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ “అఖండ’ సినిమాలో అఘోర రంగప్రవేశం నుంచి ైక్లెమాక్స్ వరకు ఫైట్స్ కంపోజ్ చేశాం. ఎనభైరోజులు పనిచేశాం. పోరాట ఘట్టాల విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఆలోచనలు మరో లెవల్లో ఉంటాయి. అఘోరా పాత్ర కాబట్టి పూర్తి విభిన్నంగా యాక్షన్‌ను డిజైన్ చేశాం. బోయపాటి, బాలకృష్ణ సహకారం వల్ల ఫైట్స్ అద్భుతంగా వచ్చాయి.
బాలయ్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి యాక్షన్ కోరుకుంటారో అదే అందించాం. ైక్లెమాక్స్‌ను వంద మందితో తీశాం. ఈ సినిమా విషయంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్లా కాకుండా బాలయ్య అభిమానుల్లా పనిచేశాం. బాలయ్య ఓ పవర్‌హౌస్. అది పోరాటఘట్టాల్లో ఆవిష్కృతమయింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా ఫైట్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు ఫుల్ మాస్. హీరోల ఇమేజ్‌కు అనుగుణంగా పోరాట ఘట్టాల్ని సమకూర్చుతాం’ అని చెప్పారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్నానని.. ‘ఎఫ్-3’ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నానని స్టన్ శివ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

