అసెంబ్లీ సమావేశాల నుంచి అకాలీదళ్ ఎమ్మెల్యేలు సస్పెండ్

చండీగఢ్: పంజాబ్‌లోని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ శుక్రవారం సమావేశమైంది. సీఎం అమరీందర్ సింగ్ గవర్నర్ ప్రసంగంపై సభలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎస్ఏడీ పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఆమోదానికి మద్దతిచ్చిందని అన్నారు. దీనిపై అకాలీదళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేశారు. సమావేశాలకు ఆటంకం కల్పించవద్దని అకాలీదళ్ ఎమ్మెల్యేలను స్పీకర్ రాణా కేపీ సింగ్ కోరారు. సభను రెండుసార్లు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పురాలేదు. ఎస్ఏడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నినాదాలు కొనసాగించారు. దీంతో స్పీకర్ అకాలీదళ్ ఎమ్మెల్యేల అందరి పేర్లు చదివి వారిని మిగతా అసెంబ్లీ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి సభను మరోసారి వాయిదా వేశారు.
మరోవైపు అకాలీదళ్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా సభలో నేలపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. కాగా పంజాబ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 వరకు కొనసాగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

