రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన అకాలీదళ్ ఎమ్మెల్యే
చండీఘడ్: ఇవాళ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్‌కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయడం లేదని అన్నారు. పంజాబ్ సమస్యల్ని కాంగ్రెస్ పరిష్కరించలేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ కూడా పంజాబ్ సమస్యల్ని పట్టించుకోలేదని, ఎందుకు అలా జరిగిందో తెలియదన్నారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌కు ముందు సిక్కు వర్గీయులను ఎవరూ కలవలేదని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అకాలీదళ్ పార్టీ ముర్ముకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అకాలీదళ్ పార్టీ తరపున పంజాబ్ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

