ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమనది: రకుల్‌ప్రీత్‌సింగ్

అజయ్‌దేవ్‌గణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మేడే’ సినిమా టైటిల్ మారింది. ఈ చిత్రానికి ‘రన్‌వే 34’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. అజయ్‌దేవ్‌గణ్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ముగ్గురి తారల ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని రకుల్‌ప్రీత్‌సింగ్ ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం. మనమే సర్వశక్తిమంతులం అని విర్రవీగే తరుణంలో ఒక్కసారిగా పాతాళంలోకి జారిపోయినట్లు నిస్పృహ ఆవహించవొచ్చు. మనలోని భావోద్వేగాల తుఫాను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. ఆకాశవీధిలో అనుక్షణం ఉత్కంఠతో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంకండి’ అంటూ సినిమా గురించి చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్.
గగనతలంలో ప్రమాదపుటంచుల వరకు వెళ్లిన విమానాన్ని రక్షించే పైలెట్ల నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇందులో అజయ్‌దేవ్‌గణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ పైలెట్స్‌గా నటిస్తున్నారు. గతంలో అజయ్‌దేవ్‌గణ్ ‘యు మీ ఔర్ హమ్’ ‘శివాయ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

