ఇతడు ఎన్నికల విక్రమార్కుడు
- 94వ సారి ఎన్నికల బరిలోకి హస్నురాం

ఆగ్రా: విక్రమార్కుడికైనా భేతాలుడి కథలతో విసుగొస్తుందేమో కానీ హస్నురాంకు ఎన్నికల్లో ఓడిపోవడంపై విసుగు రానే రాదు. ఆయన 94వ సారి ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు ఉదాహరణ. ఇది హస్నురాం అంబేడ్కరి ఎన్నికల పోరాట గాథ. ఈ రెవెన్యూ గుమాస్తా 1985 నుంచి ఇప్పటిదాకా 93 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ యేడాది ఫతేపూర్ సిక్రీ అసెంబ్లీ సీటు ఇస్తానని ఏదో పార్టీ వాగ్దానం చేస్తే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి సదరు పార్టీవారు ఆయనను వెటకారం చేసి టికెట్ నిరాకరించారు. దాంతో అంబేడ్కరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానం దక్కిందని గర్వంగా చెప్తారాయన.
ఆ తర్వాత ఆయన వరుసగా 93 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాన్షీరాం దళిత బహుజన ఐక్యత కోసం ముందుగా స్థాపించిన బామ్సెఫ్ ఉద్యోగంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. గ్రామ సర్పంచి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఆయన పోటీ చేయని ఎన్నిక లేదు. ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నామినేషన్ దరఖాస్తులను కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

