Meera Jasmine | పదేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్
నటి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరుకు మలయాళినే అయినా తెలుగుతనం ఉట్టిపడే రూపం తనది. కెరీర్ బిగెనింగ్‌లో మీరాను చాలా మంది తెలుగు అమ్మాయే అనుకున్నారు.
Meera Jasmine Tollywood Re-entry | నటి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరుకు మలయాళినే అయినా తెలుగుతనం ఉట్టిపడే రూపం తనది. కెరీర్ బిగెనింగ్‌లో మీరాను చాలా మంది తెలుగు అమ్మాయే అనుకున్నారు. అంతలా తెలుగు వారికి దగ్గరైంది ఈ మలయాళ కుట్టి. ‘చాలా బాగుంది’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ‘గుడుంబా శంకర్’, ‘భద్రా సినిమాలతో స్టార్ హీరోయిన్ల సరసన చేరింది. ఈ రెండు సినిమాలతో మీరాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. దాంతో అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఆ అవకాశాలే మీరా కెరీర్ పతనం అవడానికి కారణమయ్యాయి.
అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్ని సినిమాలను ఒప్పేసుకుంది. తీరా అన్ని పరాజయాలు కాకపోవడంతో క్రమంగా చాన్స్‌లు తగ్గాయి. ఇక అదే సమయంలో మీరా పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించేసింది. కాగా ఈ మధ్య సోషల్ మీడియాతో తిరిగి మంచి క్రేజ్ తెచ్చుకుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ మతులు పోగొడుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ‘విమానం’ అనే తెలుగు-తమిళ బైలింగ్యువల్ సినిమాతో మీరా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. జీ స్టూడీయోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
చివరగా తెలుగులో మీరా జాస్మిన్ ‘మోక్ష’ అనే సినిమాలో నటించింది. హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2013లో రిలీజైంది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పాండే, నాజర్, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

