Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ఏక్ దిన్ (EK Din). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తుండగా.. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది అమీర్ ఖాన్ అండ్ టీం.
కాగా ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు అమీర్ ఖాన్ సాయిపల్లవి అండ్ టీంతో కలిసి హాజరయ్యాడు అమీర్ ఖాన్. సినిమా చూస్తున్న టైంలో తన కొడుకు జునైద్ ఖాన్ నటన చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. సినిమాలోని సాంగ్ చూస్తూ కంటతడి పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పక్కనే సాయిపల్లవి, జునైద్ ఖాన్‌ను కూడా చూడొచ్చు.
ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ప్రొడక్షన్స్పై మన్సూర్ఖాన్, అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#AamirKhan cried after watching his son Junaid Khan’s acting in #EkDin 😭😭#SaiPallavi #JunaidKhan pic.twitter.com/g5aRAiXDXG
— Random Cine Mood (@RandomCineMood) April 26, 2026