హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఎంసెట్‌తోపాటు జేఈఈ (మెయిన్)కు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సును ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఆకాశ్ బైజూస్ మంగళవారం వరంగల్‌లో ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అభ్యర్థులకు తాము అందించే కోర్సు ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆ సంస్థ ఎండీ ఆకాశ్చౌదరి తెలిపారు. కోర్సు ద్వారా ఇచ్చే శిక్షణ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. 11వ తరగతి విద్యార్థులతో ప్రత్యేక బ్యాచ్‌లు ఏర్పాటుచేసి నిపుణులైన అధ్యాపకులతో కోర్సును బోధించనున్నట్టు వెల్లడించారు.