AAI Recruitment | ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 02 నుంచి ప్రారంభంకానుండగా.. మే 01వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 490
పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు : ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి.
వయసు : 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
జీతం : నెలకు రూ.40,000-1,40,000.
దరఖాస్తు రుసుము: రూ.300
దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ : ఏప్రిల్ 02
దరఖాస్తులకు చివరి తేదీ: మే 01
వెబ్సైట్ : https://www.aai.aero/