Murder | న్యూఢిల్లీ: స్నేహితుడి కూతురికి బ్యాటరీలు, స్క్రూలు తినిపించి దారుణంగా హత్య చేసిన యువతిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు అలేసియా బటన్ రూపంలో ఉండే బ్యాటరీలు, స్క్రూలు, నెయిల్ పాలిష్ రిమూవర్ వంటి వాటిని 18 నెలల వయస్సు కలిగిన తన స్నేహితుడి కుమార్తె ఐరిస్ రిటా అల్ఫేరాకు తినిపించి ఈ హత్యకు పాల్పడింది. గత ఏడాది జూన్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఈ దారుణ ఘటన జరిగింది.
రక్తంలో ప్రాణాంతక స్థాయిలో అసిటోన్ చేరిన కారణంగా చిన్నారి అవయవాలు చెడిపోయి మరణించినట్టు శవ పరీక్షలో తేలిందని పెన్సిల్వేనియా అటార్నీ జనరల్ మైఖెల్ హెన్రీ ప్రకటించారు. దీంతో నిందితురాలిన పోలీసులు అరెస్టు చేశారు. పాపను హత్య చేసే ముందు నిందితురాలు చిన్నారికి తినిపించిన వస్తువుల హానికరమైన ప్రభావాలను తెలుసుకొన్నదని విచారణలో తేలింది.