చేతులు, కాళ్లతో క్యూబిక్ గేమ్.. గిన్నిస్‌లోకి ఎనిమిదేండ్ల బాలుడు

బెంగళూరు : సాధారణంగా క్యూబిక్ గేమ్ ఆడాలంటేనే పిల్లలు మొదలు పెద్దవాళ్ల దాకా చాలా మంది భయపడుతుంటారు. తమతోటి కాదంటూ పెదవి విరుస్తుంటారు. కానీ, ఈ గేమ్‌ను పూర్తిచేయడంలో చాలా మంది వివిధ రకాలుగా ఆరితేరి ప్రపంచాన్ని విస్తుపరుస్తున్నారు. ఇటీవల కండ్లకు గంతలు కట్టుకుని రెండు చేతులతో రెండు క్యూబిక్స్ సరిచేసి సచిన్‌ను ఓ బాలుడు ఆశ్చర్యపరిచాడు. అలాంటి మరో చిచ్చరపిడుగు తానేం తక్కువ తినలేదంటూ.. చేతులతోపాటు కాళ్లతో కూడా క్యూబిక్ గేమ్ ఆడి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
బెంగళూరుకు చెందిన అథర్వ ఆర్ భట్ అనే ఎనిమిదేండ్ల కుర్రాడు.. అలవోకగా ఒకేసారి మూడు క్యూబిక్స్ సరిచేసి ఔరా అనిపించాడు. అదికూడా రెండు చేతుల్లో రెండు, కాళ్లతో ఒక క్యూబిక్ను ఒకేసారి సరిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ ఫీట్ చేసిన బుడతడిగా నిలిచాడు. ఈ అద్భుత ఫీట్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసింది. రెండు చేతులు, రెండు కాళ్ల సాయంతో మూడు క్యూబిక్స్ సరిచేయడంలో వేగంగా పూర్తిచేసిన రికార్డును సొంతం చేసుకున్నాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 9 న బెంగళూరులోని లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో 1 నిమిషం 29.97 సెకండ్లలో ఈ ఫీట్ పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినట్లు తెలిపింది.
ఇటీవల కండ్లకు గంతలు కట్టుకుని తనిష్క సుజిత్ అనే 13 ఏండ్ల బాలిక అత్యంత వేగంగా క్యూబిక్స్ సరిచేసింది. అలాగే చెన్నైకి చెందిన ఇలయరాం శేఖర్ అనే 25 ఏండ్ల యువకుడు నీటి అడుగున శ్వాస బిగబట్టి కేవలం రెండు నిమిషాల్లో ఆరు క్యూబిక్స్ సాల్వ్ చేసి గిన్నిస్ బుక్కులోకి ఎక్కాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

