బైకర్లతో జిరాఫీ సయ్యాటలు.. వీడియో వైరల్

జొహానెస్బర్గ్: టిమ్మీ మోజర్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బైకింగ్ కు వెళ్లినప్పుడు జిరాఫీలతో గడిపే అవకాశం లభించింది. దక్షిణాఫ్రికాలోని జొహానెస్బర్గ్ సమీపంలో లయన్ అండ్ సఫారీ పార్కులో ఈ సంఘటన జరిగింది. వారు పార్కులో అలా అలా సైకిళ్లపై తిరుగుతుండగా ఓ కొండదారి వద్ద జిరాఫీల మంద ఎదురైంది. ఏడు దాకా జిరాఫీలు ఉన్నాయి. అందులో ఒకటి రోడ్డుకు అడ్డంగా నిల్చున్నది. పార్కు సిబ్బంది సూచన మేరకు మోజర్, అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడే ఆగిపోయారు. ఓ గంట సేపు వాటిని అతి సమీపం నుండి గమనిస్తూ గడిపారు. ఒక జిరాఫీ మాత్రం మరీ దగ్గరగా వచ్చింది. తన పొడవాటి మెడను వంచి వీళ్లను వాసన చూసింది. జిరాఫీ గిట్టల సైజు చూసి మోజర్ బాపురే అనుకున్నాడు. వెనుకకు జరిగిన కొద్దీ జిరాఫీ ముందుకు ముందుకు రావడంతో కొంత కంగారు పడ్డారు. కానీ అది ఏమీ అనలేదు. ఇదంతా మోజర్ తన కెమెరాలో బంధించిం ఇన్‌స్టాగ్రాంలో పెట్టాడు.
https://www.instagram.com/reel/CODnhJLJyxk/?utm_source=ig_embed
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

