ఏ చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది?

హైదరాబాద్: చక్కెర అంటే అదొక సరళమైన పిండి పదార్థం. దానిని గ్లూకోజ్ గా మార్చుకుని శరీరం శక్తిని పొందుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనేది తెలిసిందే. రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేయడం ద్వారా లభించే తెల్లని చక్కెరకు మనం ఇప్పుడు బాగా అలవాటు పడిపోయాం. అలా కాకుండా మనం తినే ఆహారపదార్థాల్లో ప్రతిదాంట్లో ఏదో ఒక మోతాదులో చక్కెర ఉంటుంది. ఉదాహరణకు పండ్లు. వాటిల్లో ఉండే చక్కెరను ఫ్రూక్టోజ్ అంటాం. అలాగే పాల ఉత్పత్తుల్లో లాక్టోజ్ ఉంటుంది. ఇవన్నీ చక్కెరలే. మనం ఏరకం చక్కెర తింటున్నాం అనేదాన్ని బట్టి శరీరంపై ప్రభావం ఉంటుంది.
చక్కెర, బెల్లం, తాటిబెల్లం, కొబ్బరి చక్కెర, కార్న సిరప్ ఇవన్నీ కూడా మొక్కల నుంచి తీసినవే. కాకపోతే శుద్ధి చేసి వేరుపరచినవి. ఇలాంటిచక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు సంక్రమిస్తాయి. చక్కెరల వల్ల క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశాలుంటాయి. శుద్ధి చేసిన చక్కెరల కంటే పండ్లు, పాల నుంచి పొందే చక్కెర శరీరానికి చాలామంచిది. ఇక్కడ పీచుపదార్థం కీలకపాత్ర పోషిస్తుంది. పండు తింటే దానిలోని చక్కెరతోపాటుగా పీచు పదార్థం కడుపులోకి పోతుంది. అది ఆ చక్కెర త్వరగా విడుదల కాకుండా ఆపుతుంది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించి ఎడాపెడా తినకుండా ఆపుతుంది.
పండ్లలో స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లాక్బెర్రీలలో చక్కెర చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అరటి, మామిడి పండ్లలో, డ్రైఫ్రూట్స్‌లో చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటుంది. పళ్ల రసాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. కనుక రసాల కన్నా పూర్తిగా పండును తినేయడమే ఉత్తమం. తెల్లచక్కెరను దేనిలో కలుపుకుని తిన్నా కడుపు నిండుగా అనిపించదు. ఎన్ని కేలరీలు లోపలికి వెళ్లినా ఏమీ తెలియదు. అలా తింటూనే ఉంటాం. అదే సమస్య. ఊబకాయం వచ్చేది అందుకే. పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లోని చక్కెర మంచిదే. తెల్ల చక్కెర మాత్రం ఎంత దూరం పెడితే అంత మంచిదని పోషకాహార నిపుణుల మాట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

