70 లక్షల డీల్.. బెడిసికొట్టిన బేరం.. ఆ తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa)అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ...

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa)అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో పామును పట్టుకున్నముఠా సభ్యులు కొంత కాలంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్త నిధులు దొరుకుతాయానే అపోహను ప్రచారంలో పెట్టారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి, పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ మొదలు పెట్టారు. విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పలుమార్లు ప్రయత్నించి ఈ ముఠాను పట్టుకున్నారు. సుమారు నాలుగున్నర కేజీల బరువుతో బలంగా ఉన్న పామును డెభై లక్షలకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా బేరంపెట్టింది. అనేక సార్లు ఆపరేషన్ చేస్తున్న అధికారులను ఏమార్చే ప్రయత్నం చేస్తూ చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారంలో ఓ ఇంట్లో దొరికిపోయారు.
సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ ఆంజనేయ ప్రసాద్ ఓ ముఠాగా ఏర్పడి వివిధ ప్రయత్నాల్లో పామును అమ్మి భారీగా సొమ్ము చేసుకునే ప్రణాళిక వేశారు. నలుగురినీ అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఓ కారును, టూ వీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరినీ మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో విజిలెన్స్, యాంటీ పోచింగ్, కీసర రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న డీఎఫ్ఓ తో పాటు, విజిలెన్స్ సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్ శోభ అభినందించారు.
రెండు తలల పాము అపోహ మాత్రమే రెండు తలల పాముగా పిలిచే రెడ్ సాండ్ బోవాకు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆపాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసిరావటం అనేది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టంచేశారు. అలా ప్రచారం చేస్తూ డబ్బు చేసుకునే ముఠాల మాటల నమ్మవద్దని తెలిపారు. పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఈ రకమైన సమాచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 కు ఫిర్యాదు చేయాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

