మణప్పురం గోల్డ్‌లో 15 కిలోల బంగారం, రూ.5లక్షలు లూటీ
మణప్పురం గోల్డ్‌లో 15 కిలోల బంగారం, రూ.5లక్షలు లూటీ | యూపీలోని ఆగ్రాలో సినిమా తరహాలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. కమలానగర్‌లోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులోని మణప్పురం గోల్డ్‌లోన్ శాఖలో

ఆగ్రా : యూపీలోని ఆగ్రాలో సినిమా తరహాలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. కమలానగర్‌లోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులోని మణప్పురం గోల్డ్‌లోన్ శాఖలో నలుగురు సాయుధులు ప్రవేశించి 17 కిలోల బంగారం, రూ.5లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఎస్పీతో సహా ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఎట్మాద్పూర్ వద్ద నిందితులను పట్టుకున్నారు. ఈ సమయంలో దొంగలు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. అలాగే వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది.

గోల్డ్ లోన్ కంపెనీ అయిన మణప్పురం గోల్డ్ కమలానగర్‌లోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులో శాఖను నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా నలుగురు సాయుధులు బ్రాంచ్‌లోకి చొరబడి, సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. అక్కడున్న ఆభరణాలు, నగదుతో పారిపోయారు. సిబ్బంది కేకలు వేయడంతో కాల్చివేస్తామని బెదిరింపులకు దిగారు. సుమారు 20 నిమిషాల పాటు దుండగులు కార్యాలయంలోనే ఉండి.. రూ.5లక్షల నగదుతో పాటు రూ.8 కోట్ల విలువైన 17 కిలో బంగారం ఎత్తుకు వెళ్లారు. ఉద్యోగుల కార్యాలయంలోనే బంధించి.. తర్వాత పారిపోయారు. స్థానికుల సహాయం ఉద్యోగులు బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఎస్పీ మునిరాజ్, సిటీ ఎస్పీ రోహన్ ప్రమోద్, ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. ఎట్మాద్పూర్ రహదారిపై వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

