Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి | చెరువులో మునిగి ఏడుగురు బాలికలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో జరిగింది. సాంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాంచీ : చెరువులో మునిగి ఏడుగురు బాలికలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో జరిగింది. సాంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుమఠ్ బ్లాక్‌లోని షేర్‌గఢ్ పంచాయతీ పరిధిలోని బుక్రు గ్రామంలో పది మంది బాలికలు గిరిజన పండుగ ‘కర్మ పూజ’ జరుపుకునేందు కోసం గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడిపోయారు. రక్షించాలని కేకలు వేయడంతో వారిని కాపాడేందుకు వెళ్లి మరో ఐదుగురు మునిగిపోయారని అధికారులు తెలిపారు.
నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు బాలుమఠ్ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. మృతుల వయస్సు 12-20 సంవత్సరాల మధ్య ఉంటుందని, వీరంతా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఘటన నేపథ్యంలో గ్రామస్తులు 98వ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో మునిగి ఏడుగురు మృతి చెందారన్న వార్తతో షాక్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

