Agniveers Army | మాజీ అగ్నివీరులకు 50 శాతం రిజర్వేసన్లు
Agniveers Army | కేంద్ర సాయుధ బలగాల్లోకి మాజీ అగ్నివీరులను పరీక్ష లేకుండానే తీసుకోవాలని, 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.
Agniveers Army | కేంద్ర సాయుధ బలగాల్లోకి మాజీ అగ్నివీరులను పరీక్ష లేకుండానే తీసుకోవాలని, 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. సాధారణంగా బలగాల్లోకి ఎంపిక కోసం నిర్వహించే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) వంటి పరీక్షలు వీరు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఉన్న 10 శాతం ఉన్న రిజర్వేషన్ 50 శాతానికి పెంచడం విశేషం. నాలుగేండ్ల పదవీకాలం పూర్తయ్యాక అగ్నిపథ్ పథకం నుంచి బయటకు వచ్చే సైనికులకు మరొకసారి సాయుధ బలగాల్లో ఉపాధి లభించనుంది.
వీరిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB)లలో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులకు డైరెక్ట్‌గా ఎంపిక చేస్తారు. అదేవిధంగా వీరికి అదనంగా మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు కల్పించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ‘మాజీ అగ్నివీర్’ అనే విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిద్వారా అగ్నివీరుల సేవా కాలం ముగిసిన తర్వాత వారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు వంటి వారి విషయాలను తెలుసుకొని, వారిని సమయన్వయం చేయడం ఈ విభాగం లక్ష్యం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

