2 రూపాయల బిళ్లకు 5 లక్షలు!
- పాత నాణేలపై కొందరి మోజు
- లక్షలు పెట్టి కొంటున్న ఔత్సాహికులు
- మాకు సంబంధం లేదు: ఆర్బీఐ

హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మీ దగ్గర పాత రెండు రూపాయల బిళ్ల ఉన్నదా? అయితే రూ.5 లక్షలు మీ సొంతం. ఒక్క నిమిషం ఆగండి! ఆ 5 లక్షలు మీ సొంతం కావాలంటే మీ దగ్గర ఉన్న రూ.2 బిళ్లపై జాతీయ జెండా ఉండి, 1994లో విడుదల చేసినదై ఉండాలి. ఇదొక్కటే కాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్బీఐ విడుదల చేసే పాత నాణేలకు ఇప్పుడు భారీగా డిమాండ్ ఉన్నది. పాత నాణేల విక్రయానికి పలు ఆన్లైన్ సైట్లు కూడా వెలిశాయి. అటు.. ఔత్సాహికులు కూడా పాత నాణేలు కొనటానికి వెనుకాడటం లేదు. చాలామంది పాత నాణేలు ఇచ్చి, లక్షలు పోగేసుకొంటున్నారు.
ఆన్లైన్లో మస్తు డిమాండ్
క్వికర్ వెబ్సైట్లో పాత నాణేల కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. పాత నాణేలను విక్రయించేందుకు ముందుగా మన వివరాలతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విక్రయించదలచుకున్న నాణేల ఫొటోలు, వివరాలను జతచేయాలి. ప్రస్తుతం భారతదేశ పటం బొమ్మగా ఉన్న రూ.2 పాత నాణెం, పాత రూపాయి, ఐదు రుపాయల నాణేలు, పాత పది, ఐదు రూపాయల కరెన్సీ నోట్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ నాణేల విక్రయానికి తమకు ఏ సంబంధం లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆర్బీఐ పేరును, లోగోను వాడి కమీషన్లు, ట్యాక్స్‌ల పేరిట డబ్బులు వసూలు చేయటం నిబంధనలకు విరుద్ధం అని సర్క్యులర్ జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

