తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్నికేసులంటే?
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా పాజిటివ్

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153కు పెరిగింది. కొత్తగా 710 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,27,964 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో నలుగురు బాధితులు ప్రాణాలు వదలగా.. మొత్తం మృతుల సంఖ్య 3,784కు పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.59శాతం, రికవరీ రేటు 97.94శాతంగా ఉందని చెప్పింది. ఇవాళ ఒకే రోజు 91,457 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76, కరీంనగర్లో 49, వరంగల్ అర్బన్‌లో 43, ఖమ్మంలో 40, రంగారెడ్డిలో 31, పెద్దపల్లిలో 30 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం
Ramappa temple : యునెస్కో గుర్తింపుపై మంత్రి కేటీఆర్ హర్షం
Ramappa temple : యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం
రామప్పకు యునెస్కో గుర్తింపు ఇలా..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

