Jobs | హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) 432 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ఎఫ్సీ భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన సంస్థ.
ఖాళీల వివరాలు
ఐటీఐ ట్రేడ్ 432 ఖాళీలను ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, మెకానిక్, మోటార్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ తదితర విభాగాల్లో నింపుతారు.

Apprentice
అర్హతలు
పదో తరగతితో ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 27 ఏండ్ల వయసు ఉండాలి.
ఎంపిక
రాత పరీక్ష ఉండదు. నిర్దేశించిన ఎంపిక ప్రక్రియ ఆధారంగా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయవచ్చు. ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్ ఉంటుంది. వీరికి నెలకు రూ. 10,560 నుంచి 11,040 వరకు ఇస్తారు.
దరఖాస్తులు www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్లను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. వీటికి దరఖాస్తు చేసుకోవాడానికి చివరితేదీ సెప్టెంబర్ 16. ఇతర వివరాలకు వెబ్సైట్ www.nfc.gov.in చూడండి.