హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ బీ క్యాటగిరీ సీట్ల భర్తీ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా సీట్లను ఈ నెల 20లోగా భర్తీ చేసుకోవచ్చని పేర్కొన్నారు.