8 రోజులు.. 2 కోట్ల ప్రయాణికులు

- కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్టాండ్లు
- రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సులు
- అదనపు చార్జీల్లేకుండా నడుపుతున్న సంస్థ
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దసరా ప్రయాణికులతో ఆర్టీసీ బస్స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి తగ్గట్టుగా టీఎస్ఆర్టీసీ అధికారులు 4,035 ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టారు. గత 8 రోజుల్లో దాదాపు 2.04 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రైవేట్ బస్సులతో పోలిస్తే ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రధాన పాయింట్లలో టీఎస్ఆర్టీసీ సీనియర్ సిబ్బందిని నియమించింది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే వీరు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి బస్సులు వెంటనే వచ్చేలా చూస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు స్థానిక ఆర్టీఏ, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాల్లో (వైట్ నంబర్‌ప్లేట్ వాహనాల్లో) ప్రయాణికులను తరలించే కార్లు, ఇతర వాహనాల సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజుల్లో 19 కార్లను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. గురువారం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశాలున్నందున 889 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచబోతున్నట్టు తెలిపారు. టికెట్ల ధరలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bus travel
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

