అలలపై తేలియాడే స్వర్గం
దోహా: 35వేల చదరపు మీటర్ల వైశాల్యం. రూఫ్‌టాప్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, మసాజ్ సెంటర్లు, హెలీప్యాడ్లు, బీచ్, క్లబ్బులు, గోల్ఫ్, మినీ థియేటర్లు, గేమ్ జోన్లు.. ఏంటి ఏదైనా సిటీ గురించి చెబుతున్నారా అంటారా?? అదేంలేదు. ఓ హోటల్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. సముద్రం మధ్యలో, కెరటాలపై తేలియాడేలా ఓ ఐదు నక్షత్రాల హోటల్ కతార్‌లో రూపుదిద్దుకుంటున్నది. ఈ హోటల్ నిర్మాణం గతేడాది మార్చిలో ఆరంభమైంది. సముద్రపు అలల మీద గుండ్రంగా తిరుగుతూ సొంతంగా విద్యుత్‌ను తయారు చేసుకోవడం ఈ హోటల్ ప్రత్యేకత. 2025 నాటికి అందుబాటులోకి రానున్న ఈ జలలోక స్వర్గాన్ని ‘హైరీ అతక్’ అనే ఓ టర్కీ కంపెనీ నిర్మిస్తున్నది. ప్రతి ఫ్లోర్లో పచ్చటి మొక్కలతో నిండిన ఈ హోటల్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరుగబోదని ‘హైరీ అతక్’ ప్రతినిధులు తెలిపారు. హోటల్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను రీ-సైకిల్ చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!


