Britan | వారంలో 4 రోజులే పనిదినాలు.. బ్రిటన్‌లోని వంద కంపెనీల సంచలన నిర్ణయం
ఈ వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పనిచేస్తున్నారు
Britan : ఉద్యోగుల మీద పనిభారం, ఒత్తిడి తగ్గించేందుకు బ్రిటన్‌లోని కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు వంద కంపెనీలు వారంలో పనిదినాల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. దాంతో ఇక నుంచి ఆయా కంపెనీలోని ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయి. అలాగని జీతంలో కోత విధించారు. నెలంతా పూర్తి జీతం ఇస్తారు. ఈ వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పనిచేస్తున్నారు. 4 డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
యూరప్‌లోని మిగతాదేశాలతో పోల్చితే బ్రిటన్‌లోనే పనిదినాలు ఎక్కువ. దాంతో, నాలుగు రోజుల పనిదినాలను ముందుగానే ప్రయోగాత్మకంగా బ్రిటన్‌లోని కొన్ని కంపెనీల్లో ప్రవేశపెట్టారు. ఆ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు బాగుండడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంతేకాదు కొత్తవాళ్లు ఆ కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపించారు. ఉన్న ఉద్యోగులు కంపెనీ వీడకుండా చేయడంలో నాలుగు రోజుల పనిదినాల ఫార్ములా బాగా పనిచేసింది. అందుకని తమ ఉద్యోగులకు కూడా ఆ సౌకర్యం కల్పించేందుకు బ్రిటన్‌లోని వంద కంపెనీలు ఆమోదం తెలిపాయి. దాంతో, ఈ కంపెనీల్లో వారంలో 5 రోజులు 9-5 జాబ్ అనేది మరుగునపడనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

