వాస్తు, పశ్చిమ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్క వంటగది మాత్రమే ఉంచి, మిగతా ఓపెన్‌గా ఉంచవచ్చా?

పశ్చిమ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్క వంటగది మాత్రమే ఉంచి, మిగతా ఓపెన్‌గా ఉంచవచ్చా?
-కె. పద్మావతి, జీడికల్
ఇంటి నిర్మాణానికి ముందే గ్రౌండ్ ఫ్లోర్ ఎలా వాడుకోవాలి, ఎలా నిర్మిస్తే శాస్త్ర సమ్మతంగా ఉంటుందనేది స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే ఇల్లు కట్టుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లో వంటగది మాత్రమే కట్టి, మిగిలిన భాగమంతా ఖాళీగా ఉంచితే ఆగ్నేయం ఒక్కటే మూతపడుతుంది. కాబట్టి, దానిని బ్యాలెన్స్ చేయాలి. దీనికోసం నైరుతిలో ఏదో ఓ రూపంలో గది కట్టుకొని వాడుకోవాలి. ఖాళీగా మాత్రం ఉంచొద్దు. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒకే హాలుగా వాడుకోవాలనుకుంటే, వంటగది ఉండే ఆగ్నేయ దిశలో ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే వేసి ఓపెన్‌గా ఉంచాలి. అలా చేస్తే ఇబ్బంది ఉండదు.
ఇంటిముందు వరండాకు స్లాబ్ చేయాలి. దానికి మెట్లు ఎటు పెట్టాలి?
-ఎస్. చంద్రం, చౌటుప్పల్
వరండాలో మెట్లు వేరుగా, వరండా వదిలి బయటినుంచి మెట్లు వేరుగా ఉంటాయి. మెట్లను, వరండాతో కలిపి వేయాలని అనుకుంటే తూర్పు వరండాకు ఆగ్నేయంలో దక్షిణం ఎక్కి, అక్కడ ల్యాండింగ్ మీద ఉత్తరం తిరిగి వెళ్లే మలుపు మెట్లు వేసుకోవచ్చు. అలా కాకుండా వరండా ప్రత్యేకంగా ఉంచి, దానికి పై మేడవరకు మెట్లు వెళ్లాలని అనుకుంటే ఇంటి స్లాబ్ ఎత్తుతో వరండా స్లాబ్ వేసి.. ఆ వరండాకు ఆగ్నేయంలో మేడ మెట్లు వేసుకోవచ్చు. స్థలం పోతుంది, తిరుగు మెట్లు అవసరం లేదు. గుండ్రని మెట్లు వేయదలుచుకుంటే కూడా తూర్పు ఇంటికి ఆగ్నేయంలో, ఉత్తరం వరండాకు వాయవ్యంలో వేయవచ్చు. మెట్ల వెడల్పును అనుసరించి స్లాబు బాల్కనీ పెంచాల్సి ఉంటుంది. బాల్కనీ మీదికే మెట్లు అనుకుంటే పైకి వెళ్లే మెట్లు ఎంత వెడల్పుతోనైనా, సన్నగానైనా వేయవచ్చు.
పశ్చిమ మధ్య వచ్చిన మెట్ల కింద టాయిలెట్, స్టోర్ రూం పెట్టొచ్చా?
-కె.నందగోపాల్, జనగామ
ఇంటిలోపల మెట్లు పడమరలో కడితే, ఆ మెట్ల ల్యాండింగ్ ఎత్తు ఎంత అనేది చాలా ముఖ్యం. ల్యాండింగ్ కిందిభాగాన్ని ఇలా ఇతర అవసరాలకు వాడాలని అనుకున్నప్పుడు, ముందుగానే నిర్మాణపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఫ్లోరింగ్ ఆ టాయిలెట్ల వరకు వచ్చేసరికి చాలామంది ఒక ఫీటు తగ్గించి పడమరకు దిగి వెళ్లే విధంగా డౌన్ చేసి టాయిలెట్ ఎత్తు పెంచుతున్నారు. అది చాలా దోషపూరితం. ఎత్తు ఎంత వచ్చినా ఫర్వాలేదు, స్టోర్ కోసమో టాయిలెట్ కోసమో ఆ ఖాళీని వాడుకోవాలని అనుకుంటే ఫ్లోరింగ్ లెవెల్లో మార్పు లేకుండా, స్టోర్ లేదా టాయిలెట్ వేసుకోవచ్చు. టాయిలెట్‌కు తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

దక్షిణం టాయిలెట్ డ్రెయిన్ వాటర్ నైరుతిలో తిప్పి వాయవ్యం తీసుకుపోవచ్చా?
- ఎ. శ్రీకృష్ణ, బొంగులూరు
ఏ అంతస్తయినా, టాయిలెట్లకు సంబంధించిన మురుగునీరు ఇంట్లోంచి త్వరగా బయటికి వెళ్లే మార్గం చూడాలి. దక్షిణం, నైరుతి దిశల్లోంచి వెళ్లడానికి నైరుతి మూలలో చాంబర్ (గుంత) కడతారు. దానిని ఇంటి కోణం నుంచి తప్పించి అటు పశ్చిమం వైపు కానీ, లేదా దక్షిణం వైపు కానీ జరిపి గుంత కట్టాలి. లేదా అటు ఇటు రెండు చాంబర్లు అయినా కట్టి తీసుకుపోవాలి. అక్కడ, టెక్నికల్‌గా ప్రాబ్లమ్ అవుతుందని అంటారు. స్లోపు కాస్త ఎక్కువ ఇస్తే ఆగే సమస్య రాదు. దానిని వాయవ్యంలోంచి దాటించి ఉత్తరం మధ్యలోని సెప్టిక్ ట్యాంకులోకి కలపాలి. వాయవ్యంలో సెప్టిక్ గొయ్యి పెట్టవద్దు. మురుగు
నీటిని ఈశాన్యంగానే తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇండ్లకూ వాటం కుదరదు.
ఈశాన్యం ఆగ్నేయం గదులను పూర్తిగా గ్లాస్‌తో కట్టుకోవచ్చా?
-రామమూర్తి వెలిచాల, పారుపల్లి
నేడు నిర్మాణం ఓ ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది, ఏదో కొత్తగా చేసి నలుగురి ప్రశంసలు పొందాలనే ఆలోచనలో ఉంటున్నారు. అయితే, జీవితంలో కొన్ని విషయాల్లో ప్రయోగాలు సరికాదు. ఇల్లు, పెళ్లి, హోమం.. మొదలైన వాటికి సంబంధించి మన పూర్వులు అద్భుతమైన నియమాలను, చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటుచేసి పెట్టారు. వాటిని అనుసరిస్తూ పోతే చాలు. మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఆగ్నేయం, ఈశాన్యం గదులను మిగతా గదుల్లానే కట్టుకోండి. ద్వారాలను, కిటికీలను అనుకున్న కొలతలో పెట్టండి. కానీ పూర్తిగా గ్లాసుతో కట్టుకోకండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

