మిచెల్ మెరుపులు

- టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్
- అజేయ అర్ధ సెంచరీతో విజృంభణ
- ఇంగ్లండ్‌పై అద్భుత విజయం
వావ్..వావ్! ఏం మ్యాచ్. సరిగ్గా రెండేండ్ల కిందట తమకు ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. కండ్ల ముందు కల చెదిరిపోయిన క్షణాన్ని మనసులో పెట్టుకున్న కివీస్ రివ్వున ఎగిరింది. అబుదాబిలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. ఆశలు అడుగంటిన స్థితి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ డారెల్ మిచెల్ అజేయ అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ పొట్టి ఫార్మాట్లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్యఛేదనలో మెరుగైన ఆరంభం దక్కకపోయినా..పోరాటాన్ని నమ్ముకున్న కివీస్ వరుసగా నాలుగు మెగాటోర్నీల్లో తుదిపోరులో నిలిచి శభాష్ అనిపించుకుంది.
అబుదాబి: న్యూజిలాండ్ ప్లేయర్లు అద్భుతం చేశారు. బుధవారం ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి కలిగిన భావన ఇది. ఇంగ్లండ్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తమ పంథాన్ని నెరవేర్చుకుంది. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఫైట్‌కు దూసుకెళ్లిన కివీస్… ఆదివారం టైటిల్ కోసం తలపడుతుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన విలియమ్సన్ సేన మరో ఆరు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. మార్టిన్ గప్టిల్(4), కెప్టెన్ కేన్ విలియమ్సన్(5), ఫిలిప్స్(2) తీవ్రంగా నిరాశపరిచారు. వోక్స్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అలీకి క్యాచ్ ఇచ్చి గప్టిల్ భారంగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన విలియమ్సన్ కూడా కుదురుకోలేకపోయాడు. వోక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి రషీద్ చేతికి చిక్కాడు. దీంతో 13 పరుగులకే కివీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే డారెల్ మిచెల్(48 బంతుల్లో 73 నాటౌట్, 4ఫోర్లు, 4సిక్స్‌లు), కాన్వె(46) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న తరుణంలో లివింగ్‌స్టోన్ ఊరించే బంతికి కాన్వె బోల్తా కొట్టడంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వా త ఫిలిప్స్ అలా వచ్చి ఇలా వెళ్లగా, నీషమ్(11 బంతుల్లో 27, ఫోర్, 3 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. జోర్డాన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ రెండు సిక్స్‌లు, ఫోర్ తో నీషమ్ అరుసుకోవడంతో లక్ష్యం కాస్తా 18 బంతుల్లో 34కు చేరుకుంది. అదే జోరులో రషీద్ బౌలింగ్‌లో 14 పరుగులు రావడంతో సమీకరణం 12 బంతులకు 20కి మారింది. వోక్స్ వేసిన 19వ ఓవర్లో మిచెల్ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. వోక్స్, లివింగ్‌స్టోన్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు అలీ(51), మలన్(41) రాణింపుతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 166/4 స్కోరు చేసింది. సౌథీ, మిల్నె, సోధీ, నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మిచెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 166/4(అలీ 51 నాటౌట్, మలన్ 41, నీషమ్ 1/18, సౌథీ 1/24)
న్యూజిలాండ్: 19 ఓవర్లలో 167/5(మిచెల్ 72 నాటౌట్, కాన్వె 46, వోక్స్ 2/36, లివింగ్‌స్టోన్ 2/22)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

