దక్షిణం రోడ్డు ఉన్న ఇంటికి మధ్యలో బుల్లెట్ రోడ్డు పెట్టుకోవచ్చా?

-కంది వెంకటలక్ష్మి, ఆత్మకూరు
ఇంటికి మధ్యలో చక్కగా రోడ్డు రావడాన్ని బుల్లెట్ రోడ్డు, లేదా బాణం రోడ్డు అంటారు. గీతలాగా వస్తాయి కాబట్టి అలా పిలుస్తారు. ఇలాంటివి తూర్పు మధ్యలో, ఉత్తరం మధ్యలో నేరుగా వచ్చిపడితే దోషం ఉండదు. కానీ విషయం రోడ్డుమీద కాకుండా, అదిపడే దిశమీద ఉంటుంది. అదే సెంటర్ రోడ్డు మీరు కట్టే దక్షిణ ముఖద్వారం ఇంటికి ఏ మాత్రం పనికిరాదు. మీ ఇంటికి మీరే రోడ్డు నిర్ణయించేలా స్థలం లే అవుట్ మీ చేతుల్లో ఉంటే, అప్పుడు దక్షిణం కాకుండా ఉత్తరం లేదా తూర్పు దిశలో రోడ్డు వేసుకోండి. దక్షిణం రోడ్డు ఉన్నా కూడా ఉత్తరంలో కూడా ఒక కొత్త రోడ్డు వేయండి. దానినుండి నేరుగా ఇంటి ఉత్తరం మధ్యలో పడేలా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మీ ఇంటి ముఖద్వారం ఉత్తరం మధ్యలో ఆ రోడ్డుకు ఎదురుగా ఉండేలా నక్ష గీసుకోండి. అయితే దిశకు అనుగుణంగా మీ స్థలం అమరిక ఉండాలి.
కొత్త వెంచర్ వేస్తున్నాం. సెల్లార్ కానీ, సెమీ సెల్లార్ కానీ పెట్టొచ్చా?
- బద్దుల పవన్‌కుమార్, మేడ్చల్
సెమీ సెల్లార్ అంటే, మూడు లేదా నాలుగు అడుగులు రోడ్డు నుండి కిందికి, ఐదు లేదా ఆరు అడుగులు ఇల్లు ఫ్లోర్ మీదికి ఉండేలా నిర్మించడం. మీ వెంచర్లో అన్నీ ఇండివిజువల్ తూర్పు, పశ్చిమ ముఖాలుగా ఇండ్లు కడుతున్నారు. అయితే సెల్లార్ సెమీ అయినా, పూర్తిగా అయినా తూర్పు సింహద్వారం ఇండ్లకు పనికిరాదు. పశ్చిమ రోడ్డు ఉన్న ఇండ్లకు మీ ఇష్టానుసారం సెల్లార్ ఉండొచ్చు. కేవలం స్టిల్ట్తో గ్రౌండు భాగాన్ని పూర్తిగా వదిలి, ఇంటిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్లాన్ చేసుకోవడం మంచిది. అనేక కాలనీలు వర్షాలకు చెరువులుగా మారుతున్నాయి. ఎంత టెక్నాలజీ వాడినా సరే సెల్లార్ లేని ఇండ్లే మంచివి.
రెండు ఊళ్ల పొలిమేరలు కలిసే చోట, వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకోవచ్చా?
-కేవీ ఆనంద్, చర్ల, భద్రాచలం
పొలిమేరల దగ్గర ఊరిని రక్షించే గ్రామదేవతలు స్థిర నివాసం ఉంటారని విశ్వాసం. కొంతమంది అవేవీ పట్టించుకోరు. పూర్తిగా పొలిమేర మీద కాకుండా మనదైన స్థలంలో (వ్యవసాయ క్షేత్రంలో) కొంత హద్దుబాట విడిచిపెట్టి ఇల్లు కట్టుకోవచ్చు. కట్టిన ఇంటికి ఊరిబాటగానీ, పానాది కానీ తగలకుండా చూసుకోవాలి. వ్యవసాయ క్షేత్రంలో బావి, కాలువ లాంటివి ఉంటే అవి ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో వచ్చేలా చూసుకోవాలి. స్థలాన్ని మార్కు చేసుకొని వాస్తుపరంగా కట్టుకోండి. ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా కాంపౌండు ఉండాల్సిందే. అది ఇంటికి, ఇంట్లోవాళ్లకు రక్షణనిస్తుంది.
గడీ స్థలాన్ని కొనవచ్చా?
-కావలి సుభద్ర, మోత్కూర్
కొన్ని ఏండ్లపాటు నివసించిన స్థలంలో ఎన్నో వక్రతలు ఉంటాయి. భౌతికమైనవే కాకుండా, ఆ స్థలంలో జరిగిన సంఘటనల ప్రభావాలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ‘స్థలశుద్ధి సంప్రోక్షణ’ చేయాల్సి ఉంటుంది. ఎవరూ ఉద్దేశపూర్వకంగా గృహాన్ని తప్పుగా కట్టుకోరు. కానీ, కొత్తగా కొనేవాళ్లు మార్పులు చేసుకోవడానికి, లేదా పూర్తిగా తీసి కట్టుకోవడానికి సిద్ధపడి నిర్ణయం తీసుకోవాలి. ఇక, గడీ కొనకూడదని ఏమీ లేదు. అది విశేషమైన స్థలంలో, ఎత్తయిన ప్రహరీలతో ఎన్నో వీధిపోట్లతో, వీధిచూపులతో ఉంటుంది. కాబట్టి గడీ ఉన్నది ఉన్నట్లుగా వాడుకునే విధంగా ఉండకపోవచ్చు. అన్ని అంశాలను సరిచూసుకొని తీసుకోండి. స్థలం ఉత్తమం అనుకుంటే నిర్మాణానికి మార్పులు అసాధ్యం కాదు.
ఇంటికి ఉత్తరంలో యు ఆకారంలో రోడ్డు ఉంటే మంచిదేనా?
-కుర్ర భూదేవి, రుద్రారం

కొన్ని చౌరస్తాల్లో ఉన్న ఇండ్లకు చిత్రంగా రోడ్ల పోటు పడుతూ ఉంటుంది. అది దోష భూయిష్ఠంగా ఉండే అవకాశం ఎక్కువ. ఉత్తరంలో ఇంటికి ‘యు’ ఆకారంలో వీధులు వస్తున్నాయి, అంటే దాని వెడల్పును బట్టి, అవి పడే చోటును బట్టి వాటి ఫలితం నిర్ణయించాలి. ఉత్తరంగా ఎదురుగా వచ్చి ఇంటి వద్ద మలుపు తిరిగి, ఈశాన్యంగా ఆ రోడ్డు ‘యు’ ఆకారంలో వెళ్లినట్లయితే, దిశ మన ఇంటికి బాగుంటే ఆ రోడ్లు ఇంటికి దోషం కావు. రెండూ వీధి చూపులే కానీ చాలా అరుదుగా అలా వస్తాయి. లేదు ఉత్తర ఈశాన్యంగా ఎదురుగా వచ్చి, ఇంటికి వాయవ్య భాగంగా మలుపు తిరిగి పోతూ ఉంటే, ఒక రోడ్డు వీధిపోటుగా ఉంటుంది. అది దోషం. అలా కాకుండా ఇంటికి వాయవ్యంలో యు ఆకారంగా రోడ్లు వస్తే, ఆ రెండు వీధులు కోణంగా వీధిపోట్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా చూసుకొని ఇల్లు మారండి. వీధులను మార్చలేం. అలానే ఇలాంటి రోడ్లపోటుకు ఇంట్లో కూడా మార్పులు అసాధ్యం. కాబట్టి మంచి ఇంటికి మారండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

