జాగ్రత్తగా!.. పతంగులు పండుగ
సంక్రాంతి.. ముగ్గులు, గొబ్బెమ్మల పండుగ. పతంగులు, మాంజాల వేడుక. ఇరుగుపొరుగుతో పోటీపడి గాలిపటాలు ఎగరేస్తాం. కానీ, మన వినోదం మరొకరికి ప్రమాదం కాకూడదు. తెగిపోయిన దారాలు.. ఆ దారిన నడుస్తున్నవారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. తెగిన పతంగులను వెంటాడుతూ వీధుల్లో పరుగులు పెట్టే పిల్లలు.. ఆ ఉత్సాహంలో ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. ఇదంతా, మనుషులకు సంబంధించిన కోణం.

పక్షుల కథ మరీ దయనీయం. చాలావరకు తెగిపోయిన పతంగుల దారాలు చెట్లకు, కరెంటు తీగలకు చుట్టుకుంటాయి. వాటి మీద కూర్చున్న పక్షుల మెడలకు చుట్టుకొని ప్రాణాలను కబళిస్తాయి. అంతేకాదు, లోహపు పూత ఉన్న మాంజా.. వీధుల్లో వేలాడుతున్న విద్యుత్, కేబుల్ టీవీ తీగలకు అంటుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ముప్పు ఉంది. ఇలాంటి సంఘటనలు మన దగ్గర ఎక్కువే. పతంగులను సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఎగరేయడం ఎలాగో తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. అవసరమైతే దగ్గరుండి నేర్పించాలి. తగిన జాగ్రత్తల మధ్య పతంగుల పండుగను సురక్షితంగా జరుపుకొంటే.. అంతకు మించిన సంబురం ఉండదు.
– డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్
యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య