మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నవోమీ ఒసాకా (జపాన్)కు షాక్ తగిలింది. గత సీజన్లో విజేతగా నిలిచిన ఒసాకా.. ఈ సారి మూడో రౌండ్లోనే ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన పోరులో ఒసాకా 6-4, 3-6, 6-7 (5/10)తో అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా చేతిలో ఓడింది. తొలి సెట్ నెగ్గిన ఒసాకా.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో అనవసర తప్పిదాలకు పాల్పడ్డ ఒసాకా మూల్యం చెల్లించుకుంది. ఐదు ఏస్‌లకే పరిమితమైన ఈ జపాన్ స్టార్..ప్రత్యర్థికి పోటీనివ్వడంలో ఘోరంగా విఫలమైంది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-2, 6-3తో జార్జీపై గెలుపొందగా.. సక్కారి, క్రెజికోవా, అజరెంకా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ నాదల్ 6-3, 6-2, 3-6, 6-1తో కచనోవ్‌పై విజయం సాధించగా.. జ్వెరెవ్, షపలోవ్, బెరెట్టిని ముందంజ వేశారు.