Russia – Ukraine War | నిన్న మొన్నటి దాకా స్వర్గసీమలా ఉన్న జన్మభూమి.. ఇప్పుడు నరకంగా మారిపోయింది. రష్యా మారణకాండతో ఉక్రెయిన్ రావణకాష్టంగా తయారైంది. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియక.. ఎప్పుడు ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోన్న భయంతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. మరికొందరు బంధాలను బలి చేసుకోలేక.. తమ ఆశలను సమాధి చేసుకుని పొరుగు దేశమైన పోలాండ్‌కి వలస వెళ్లిపోతున్నారు. తల్లిలాంటి జన్మభూమికి మళ్లీ తిరిగి వస్తామో లేదోనని ఉక్రెయిన్ సరిహద్దుల్లో విలపిస్తున్నారు. బరువెక్కిన హృదయంతో పుట్టిన దేశానికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు.