Linewoman | మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మగాళ్ల కంటే ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులకే సాధ్యం.. ఆడవాళ్లతో సాధ్యం కాదనుకున్న లైన్‌మన్ జాబుల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇటీవల ట్రాన్స్‌కోలో నియమితులైన జూనియర్ లైన్వుమెన్.. పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా సబ్‌స్టేషన్‌లోని స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా డిండిలో 400 కేవీ సబ్‌స్టేషన్ వద్ద కనిపించిందీ దృశ్యం.