HCU | ఆలోచనలకు రెక్కలొస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 40 అడుగుల ఎత్తున్న కొండపై 15 అడుగుల ఎత్తుతో కళాకారుడు ధీరజ్ రూపొందించిన స్టెయిన్లెస్ స్టీల్ శిల్పం అందరినీ ఆకట్టుకుంటున్నది. ఉన్నత లక్ష్యాలతో క్యాంపస్లో అడుగుపెట్టే విద్యార్థుల స్వేచ్ఛకు అద్దం పట్టేలా.. రెక్కలొచ్చి రేపటి ప్రపంచంలోకి ఎగిరిపోవాలని స్ఫూర్తిని రగిలిస్తున్నది. వీటితో పాటు ధీరజ్ చేతిలో ప్రాణం పోసుకున్న మరికొన్ని కళాఖండాలు క్యాంపస్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నవి.