Zomato-Eternal | ఇండియన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జోమాటో తన పేరు మార్చుకుంటున్నది. కీలక బిజినెస్ విభాగాలకు వేర్వేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించిన జొమాటో.. తన పేరు ఎటర్నల్ ( Eternal ) గా మార్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రాసరీ డెలివరీ స్టార్టప్ సంస్థ బ్లింకిట్ టేకోవర్ ఒప్పందానికి ఆమోదం లభించిన తర్వాత జొమాటో తన పేరు మార్చుకోవడంతోపాటు నాలుగు కీలక విభాగాలకు వేర్వేరు సీఈవోలను నియమించనున్నది.
అలీబాబా అనుబంధ ఆంట్ గ్రూప్, టెమాసెక్ హోల్డింగ్స్, గోల్డ్‌మన్ సాచెస్ గ్రూప్ పెట్టుబడులతో జొమాటో పని చేస్తున్నది. బ్లింకిట్ స్టార్టప్‌ను స్వాధీనం చేసుకున్నాక జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నది. రెస్టారెంట్లకు వంట సామగ్రి సరఫరా చేసే హైపర్ ప్యూర్ సంస్థను కలిగి ఉంది.
జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, ఫీడింగ్ ఇండియా.. తదితర సంస్థల్లో ఒక్కో సంస్థను ఒకరినీ సీఈవోగా నియమిస్తున్నట్లు జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ తెలిపారు. ఇక సంస్థ పేరు ఎటర్నల్‌గా మారుతుందన్నారు. డెలివరీ టిక్కర్పై ఎటర్నల్‌గా కొనసాగుతుందన్నారు. మంగళవారం ట్రేడింగ్‌లో జొమాటో షేర్లు దాదాపు 20 శాతం లాభంతో ముగిశాయి.