Electric Three Wheeler | న్యూఢిల్లీ, మే 30: జెన్ మొబిలిటీ కంపెనీ జెన్ మైక్రో పాడ్ పేరుతో కార్గో ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను లాంచ్ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన జెన్ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్, లీజింగ్ సంస్థలతోపాటు థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి రూపొందించింది. లీజు రకాన్ని బట్టి వారికి వాహనాన్ని నెలకు రూ.9,999 అద్దెపై అందించనున్నది.