Y-Tuber Birthday | యూ-ట్యూబర్ బర్త్‌డే వేడుకలు.. నొయిడా మెట్రోస్టేషన్ వద్ద తొక్కిసలాట
Y-Tuber Birthday | మెట్రో స్టేషన్ వద్ద బర్త్‌డే వేడుకలు జరుపుకోవాలని ప్రయత్నించిన యూ-ట్యూబర్ గౌరవ్ తనేజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Y-Tuber Birthday | తన పుట్టిన రోజు వేడుకలు మెట్రో స్టేషన్లో జరుపుకుంటానని ఒక యూ-ట్యూబర్ చేసిన ప్రకటన ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. గౌరవ తనేజా అనే యూ-ట్యూబర్ పుట్టిన రోజు వేడుకల కోసం ఆయన ఫాలోవర్లు భారీగా చేరడంతో ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా 51వ నంబర్ మెట్రో స్టేషన్లో రద్దీ ఏర్పడింది. ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకు గౌరవ్ తనేజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నొయిడా మెట్రో స్టేషన్లోనే తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటానని సోషల్ మీడియాలో గౌరవ్ తనేజా ప్రకటించాడు. అంతే కాదు ఒక మెట్రో కోచ్ కూడా బుక్ చేయడంతో వేల మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ప్రజలు, అభిమానులు రావడంతో రద్దీతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.
సకాలంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఇంతకుముందు పైలట్‌గా పని చేసిన గౌరవ్ తనేజా.. `ఫ్లయింగ్ బీస్ట్` అనే పేరుతో యూ-ట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. ఆ చానెల్‌కు 75.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

