ఖాతాలో 8 వేలు జమంటూ వదంతులు.. పోస్టాఫీసుకు పోటెత్తిన మహిళలు
కర్ణాటకలోని బెంగళూరులో పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు పోస్టాఫీస్ ఖాతాలకు రూ.8 వేలు జమ చేయనున్నాయన్న తప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగడంతో సోమవారం వేలాది మంది మహిళలు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్(జీపీవో)కు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే మహిళలు గుమిగూడటం ప్రారంభించారు.
- రాజకీయ పార్టీలు రూ.8 వేలు వేస్తున్నాయని తప్పుడు ప్రచారం
- బెంగళూరులో బారులు
బెంగళూరు, మే 28: కర్ణాటకలోని బెంగళూరులో పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు పోస్టాఫీస్ ఖాతాలకు రూ.8 వేలు జమ చేయనున్నాయన్న తప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగడంతో సోమవారం వేలాది మంది మహిళలు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్(జీపీవో)కు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే మహిళలు గుమిగూడటం ప్రారంభించారు. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన వాళ్లను అదుపు చేసేందుకు జీపీవో అధికారులు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.
వచ్చిన వాళ్ల కోరిక మేరకు కొత్త ఖాతాలు తెరిచేందుకు అదనపు సిబ్బందిని రప్పించారు. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ కింద ఖాతా తెరిచిన ప్రతి ఖాతాలో పోస్టల్ శాఖ డబ్బును డిపాజిట్ చేస్తుందని గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఇది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. రిజిస్ట్రేషన్‌కు సోమవారం చివరి రోజు అని ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో మహిళలు జీపీవోకు వచ్చారు. దీనిపై జీపీవో చీఫ్ పోస్టు మాస్టర్ హెచ్ఎం మంజేశ్ స్పష్టత ఇచ్చారు. పోస్టల్ శాఖ అలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదని చెబుతూ ఎంట్రీ గేట్ల వద్దనే పోస్టర్లు కూడా అతికించామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

