నవంబర్లోనే మహిళలకు ఎన్డీఏ

- వచ్చే ఏడాదికి వాయిదా కుదరదు
- మహిళల హక్కును నిరాకరించలేం
- కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళల ప్రవేశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మహిళా అభ్యర్థులు ఈ ఏడాది నవంబర్లోనే ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాయవచ్చని, వచ్చే ఏడాది మే వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ పరీక్షకు వచ్చే ఏడాది నుంచి మహిళలను అనుమతిస్తామని, అందుకు అంగీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కును నిరాకరించలేమని, వారి అవకాశాన్ని మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. ‘పరీక్ష ఇప్పుడు కాదు తర్వాత నిర్వహిస్తామ’నే ధోరణి యువతుల ఆకాంక్షలను నెరవేర్చదని వ్యాఖ్యానించింది. చాలా తక్కువ సమయం ఉన్నదన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ‘సాయుధ దళాలు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అలాంటివాటిని అధిగమించడంలో అవి సుశిక్షితమైనవి. ఇప్పుడు కూడా సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించగలవ’ని పేర్కొంది.
అప్పటివరకు ఆగాలా?
ఇప్పటివరకు ఎన్డీఏలో ప్రవేశానికి మహిళలకు అనుమతి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశం కల్పించకపోవడం లింగ వివక్షేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రానిది ‘మైండ్‌సెట్ సమస్య’ అన్నది. దీంతో తొలి మహిళా బ్యాచ్‌ను వచ్చే ఏడాది మేలో పరీక్షకు అనుమతిస్తామంటూ కేంద్రం కోర్టుకు తెలిపింది. వచ్చే ఏడాది మేలో నిర్వహించే పరీక్ష వరకు నిరీక్షిస్తే 2023 జనవరిలో కానీ వారు ఎన్డీఏలోకి అడుగుపెట్టలేరని చెబుతూ వాయిదాకు కోర్టు నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

