death sentence | ప్రేమను తెంచుకునేందుకు.. ప్రియుడికి విషమిచ్చి చంపిన మహిళకు మరణశిక్ష
death sentence | మరో వ్యక్తితో పెళ్లి నేపథ్యంలో ప్రేమ సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ప్రియుడికి విషం ఇచ్చి చంపింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు మరణశిక్ష విధించింది.
తిరువనంతపురం: మరో వ్యక్తితో పెళ్లి నేపథ్యంలో ప్రేమ సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ప్రియుడికి విషం ఇచ్చి చంపింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు మరణశిక్ష విధించింది. (death sentence) కేరళకు చెందిన 23 ఏళ్ల షారన్ రాజ్, తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల గ్రీష్మ ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమించుకున్నారు. అయితే గ్రీష్మకు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో ప్రేమ సంబంధాన్ని వదులుకోమని రాజ్‌కు చెప్పింది. అతడు ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించింది. తొలుత జ్యూస్‌లో పారాసిటమాల్ మాత్రలు కలిపి రాజ్‌కు ఇచ్చింది. అయితే చేదుగా ఉండటంతో తాగేందుకు అతడు నిరాకరించాడు.
కాగా, 2022 అక్టోబరు 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా రామవర్మంచిరైలోని తన ఇంటికి ప్రియుడు రాజ్‌ను గ్రీష్మ రప్పించింది. ఆయుర్వేద టానిక్‌లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన రాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. పలు అవయవాలు దెబ్బతినడంతో 11 రోజుల తర్వాత అక్టోబర్ 25న మరణించాడు. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది.
మరోవైపు రాజ్‌ను హత్య చేసిన గ్రీష్మ, సహకరించిన ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఈ కేసుపై విచారణ కోర్టులో కొనసాగింది. జనవరి 17న తిరువనంతపురంలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గ్రీష్మను దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్షలు ఖరారు చేసింది. గ్రీష్మకు మరణశిక్ష విధించింది. ఆమెకు సహకరించి, ఆధారాలు ధ్వంసం చేసిన మేనమామ నిర్మల్ కుమార్‌కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

