Patiala Gurdwara: గురుద్వారాలో మద్యం తాగిన మహిళను కాల్చి చంపిన వ్యక్తి
Patiala Gurdwara: గురుద్వారాలో మందు తాగుతున్న ఓ మహిళను ఓ విజిటర్ తన వద్ద ఉన్న లైసెన్స్ పిస్తోల్‌తో కాల్చి చంపాడు. అయిదు రౌండ్ల కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.
పాటియాలా: పంజాబ్‌లోని ఓ గురుద్వారాలో మద్యం సేవించిన మహిళను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన పాటియాలా గురుద్వారాలో ఆదివారం సాయంత్రం జరిగింది. పర్మీందర్ కౌర్ అనే మహిళ దుక్నీవార్న్ సాహిబ్ గురుద్వారాలో ఉన్న సరోవర్ వద్ద మద్యం సేవిస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న నిర్మల్జిత్ సింగ్ అనే వ్యక్తి ఆ మహిళను కాల్చి చంపాడు. 32 ఏళ్ల పర్మీందర్ కౌర్ .. అర్బన్ ఎస్టేట్ ఫేజ్ 1లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకున్న లోపే.. నిర్మల్జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్‌తో ఆ మహిళపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా.. ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనో ప్రాపర్టీ డీలర్ అని, అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమీలేదని పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

