Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Kanpur Accident: మహేంద్ర థార్ వాహనంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్తున్న 55 ఏళ్ల వ్యక్తిని ఓ మహిళ ఢీకొట్టింది. ఈ ఘటన కాన్పూర్‌లో శనివారం రాత్రి జరిగింది. స్కూటర్‌పై ఉన్న వ్యక్తి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
కాన్పూర్: యూపీలో ఓ మహిళ తన మహేంద్ర థార్ వాహనంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్తున్న 55 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటన కాన్పూర్‌లో శనివారం రాత్రి జరిగింది. స్కూటర్‌పై ఉన్న వ్యక్తి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం .. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎస్‌యూవీలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. అదుపు తప్పిన థార్ వాహనం.. రోడ్డుపై అనేక మందిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్కూటర్‌ను నడిపిస్తున్న సంతోష్ సింగ్ చౌహాన్ స్పాట్లోనే మృతిచెందాడు. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత థార్ ఎస్‌యూవీని వదిలేసి ఆ మహిళలు పారిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపారు. థార్ వాహనాన్ని గుర్తించారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై అన్వేషిస్తున్నారు. వాహనంపై వెనుక భాగంలో కృష్ణ గ్రూపు అని రాసి ఉన్నది. బాధిత ఫ్యామిలీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. థార్ చాలా వేగంగా ప్రయాణిస్తోందని, స్కూటర్‌ను ఢీకొట్టి దాన్ని 30 మీటర్ల లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

