చెన్నై, జూలై 15: భర్త బతికుండగా భార్య తన తాళిని తీసేసుకోవడం తీవ్రమైన క్రూరత్వం కిందకే వస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. శివకుమార్ అనే వ్యక్తి విడాకుల కేసులో ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తూ అతడికి విడాకులు మంజూరు చేసింది.
శివకు, అతడి భార్యకు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. 2011 నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు. ఆ సమయంలో ఆమె మెడలోని తాళి తీసేసిందని శివ మద్రాస్ హైకోర్టుకు తెలిపాడు. ఈ చర్య శివను మానసిక క్షోభకు గురిచేసిందని కోర్టు పేర్కొన్నది.