Kerala: నదిలో 10 కిలోమీటర్లు కొట్టుకుపోయింది.. కానీ బ్రతికే ఉంది
Kerala: 64 ఏళ్ల ఓ మహిళ కల్లడ నదిలో కొట్టుకుపోయింది. నదిలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండగా ఆమె సుమారు పది కిలోమీటర్ల దూరం ఆ నీటిలో తేలుకుంటూ వెళ్లిపోయింది. నది ఒడ్డున బట్టలు జాడిస్తూ కాలు జరాడంతో శ్యామలమ్మ నదీ ప్రవాహంలో పడిపోయింది.
కొల్లామ్: కేరళలోని కొల్లామ్‌కు చెందిన 64 ఏళ్ల మహిళ కల్లడ నదిలో కొట్టుకుపోయింది. నదిలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండగా ఆమె సుమారు పది కిలోమీటర్ల దూరం ఆ నీటిలో తేలుకుంటూ వెళ్లిపోయింది. నది ఒడ్డున బట్టలు జాడిస్తూ కాలు జరాడంతో శ్యామలమ్మ నదీ ప్రవాహంలో పడిపోయింది. అయితే ఇటీవల వర్షాలు కురుస్తున్న కారణంగా.. నదిలో నీరు తీవ్ర స్థాయిలో ప్రవాహిస్తున్నది. ఈత కొట్టడం తెలియని శ్యామలమ్మ.. నది నీటిలో పడిన తర్వాత ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో.. తన ముఖాన్ని పైకి లేపి.. ఆ ప్రవాహంలోనే వెళ్లిపోయింది.
చెట్టియారజికత్త, జాకడావు, కున్నతూరు బ్రిడ్జ్‌లను దాటుకుంటూ ఆమె కొట్టుకుపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆమెను కున్నతూరు బ్రిడ్జ్ నుంచి కొందరు వీడియో కూడా తీశారు. కానీ ఆమె అప్పటికే మృతిచెంది ఉంటుందని అనుమానించారు. అయితే అదృష్టం కొద్దీ.. చేరుపొయక వద్ద ఉన్న మంగలసెరి ఘాట్‌లో ఉన్న నది పొదల్లో ఆమె చిక్కుకున్నది. ఓ తీగ చెట్టును పట్టుకుని మూలుగుతున్న ఆమె అరుపులను స్థానికులు విన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పడవలో వెళ్లి ఆమెను రక్షించారు. కల్లడ నది రూట్లో ఉన్న ఉరులుమాల వద్ద ఉన్న చెట్ల తీగల్లో శ్యామలమ్మ ట్రాపైంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ప్రైమరీ వైద్య చికిత్స చేయించారు. ఆమెకు ఎటువంటి మేజర్ గాయం కాలేదని తేల్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

