Sulibhanjan Hills: కొండపై కారును రివర్స్ తీస్తూ.. లోయలో పడి యువతి మృతి.. వీడియో
Sulibhanjan Hills: కొండపై కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ యువతి.. అనుకోకుండా లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. రివర్స్ గేర్ వేయడం నేర్చుకుంటున్న ఆమె.. ఆ కారుతోనే లోయలో పడిపోయింది. ఔరంగబాద్ సమీపంలోని సులీబంజన్ హిల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆమె ఫ్రెండ్ ఆ వీడియో తీశాడు.
ముంబై: మహారాష్ట్ర దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి.. ప్రాణాలను కోల్పోయింది. ఔరంగాబాద్ వద్ద ఉన్న సులీబంజన్ హిల్స్(Sulibhanjan Hills)పై కారును రివర్స్ తీయడం నేర్చుకుంటున్న ఆమె.. నేరుగా వెళ్లి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వేజ్ మృతిచెందింది. అయితే తన ఫ్రెండ్ 25 ఏళ్ల సూర్ సంజూ మూలేతో కలిసి ఆమె ఆ హిల్స్‌కు వెళ్లింది. అక్కడ కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఆమె ఫ్రెండ్ వీడియో తీశాడు. నెమ్మదిగా రివర్స్ తీయాలంటూ ఆ అబ్బాయి చెబుతున్న సమయంలో శ్వేత కారును రివర్స్ చేసింది. లోయకు 50 మీటర్ల దూరంలోనే ఆమె కారును రివర్స్ తీసింది. కానీ వెనక్కి వెళ్తున్న కొద్దీ ఆమె కారు వేగాన్ని పెంచింది. స్లో చేయాలని ఫ్రెండ్ చెబుతున్నా ఆమె కారు వేగాన్ని నియంత్రించలేకపోయింది. క్లచ్ క్లచ్ అంటూ ఆమె ఫ్రెండ్ అరిచాడు. కారును ఆపేందుకు ఫ్రెండ్ పరుగెత్తినా.. వేగంగా రివర్స్ తీయడంతో ఆ కారు వెళ్లి లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. సుమారు 300 ఫీట్ల లోతులోకి కారు పడిపోయింది. కారు తుక్కుతుక్కు అయిన విజువల్స్ రిలీజ్ చేశారు. సులీబంజన్ కొండల్లో ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని వాళ్లు విజిట్ చేశారు. కానీ వాళ్ల ప్రయాణం విషాదంతం అయ్యింది.
रीलचा नाद जीवावर, रिव्हर्स घेताना एक्सलेटरवर पाय, कार दरीत कोसळून २३ वर्षीय तरुणीचा मृत्यू pic.twitter.com/BiOIJ7FqwB
— Maharashtra Times (@mataonline) June 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

