అహ్మదాబాద్: దంపతుల మధ్య గొడవ జరుగడంతో భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న 13 ఏళ్ల కుమార్తె నోట్లో గుడ్డలు కుక్కి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య ఇది చూసి షాక్ అయ్యింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Man Rapes Daughter) గుజరాత్లోని వడోదర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 28 సాయంత్రం వేళ దేసర్ తాలూకా పరిధిలోని గ్రామంలో నివసిస్తున్న భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు అతడి భార్య సమీపంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. దంపతుల 13 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు ఇంట్లో ఉన్నారు.
కాగా, అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ తన సోదరితో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా కుమార్తె నోట్లో గుడ్డలు కుక్కి భర్త లైంగిక దాడికి పాల్పడటాన్ని ఆమె చూసి షాకైంది. భార్య, ఆమె సోదరిని చూసిన భర్త అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం ఆ మహిళ తన కుమార్తె నోట్లో ఉన్న గుడ్డలను బయటకు తీసి జరిగిన విషయం తెలుసుకున్నది. కూతుర్ని ఆమె ఓదార్చింది. ఆ తర్వాత తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.