watch: బీజేపీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో మహిళ అశ్లీల డ్యాన్స్.. వీడియో వైరల్
Woman Performs Obscene Dance | బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కార్యక్రమంలో ఒక మహిళ అశ్లీల డ్యాన్స్ చేసింది. (Woman Performs Obscene Dance) స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామపెద్ద వేదిక వద్ద ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కార్యక్రమంలో ఒక మహిళ అశ్లీల డ్యాన్స్ చేసింది. (Woman Performs Obscene Dance) స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామపెద్ద వేదిక వద్ద ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం భోజ్‌పూర్ ప్రాంతంలోని షకుర్పూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్ద, ఆయన భార్య, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు హాజరయ్యారు.
కాగా, ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమాలోని ‘ఛత్ పే సోయా థా బెహ్నోయి’ పాటకు ఒక మహిళ అసభ్యకరంగా డ్యాన్స్ చేసింది. అశ్లీల డ్యాన్స్‌కు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రజాప్రతినిధులు వెళ్లిన తర్వాత స్థానిక ప్రజలకు వినోదం కోసం మహిళతో డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
"विकसित भारत संकल्प यात्रा"
📍गाजियाबाद, उत्तर प्रदेश pic.twitter.com/8jBHnW2cXP
— Sachin Gupta (@Sachingupta) December 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

