woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
woman kills twin sons | భర్త చనిపోయిన మహిళకు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. అయితే వారిని అంగీకరించేందుకు ఆమె ప్రియుడు నిరాకరించాడు. ఆ మహిళను పెళ్లి చేసుకోబోనని అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో కవల కుమారులను తల్లి హత్య చేసింది.
జైపూర్: భర్త చనిపోయిన మహిళకు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. అయితే వారిని అంగీకరించేందుకు ఆమె ప్రియుడు నిరాకరించాడు. ఆ మహిళను పెళ్లి చేసుకోబోనని అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో కవల కుమారులను తల్లి హత్య చేసింది. (woman kills twin sons) రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం దసరా పండుగ రోజున గ్రామంలోని పొలంలో 13 ఏళ్ల వయస్సున్న కవల సోదరుల మృతదేహాలు కనిపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భర్త మరణించడంతో పుట్టింట్లో నివసిస్తున్న ఒక మహిళకు చెందిన కవల కుమారులుగా ఆ బాలురను గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం, ఇన్వెస్టిగేషన్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు.
కాగా, డాగ్ స్క్వాడ్‌తో చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు గాలించారు. ప్రాథమిక విచారణ, సాక్ష్యాల ఆధారంగా ఆ మహిళ ఇంటి లోపలే నేరం జరిగినట్లు గుర్తించారు. హత్యాయుధం, దుస్తులు, ఇతర వస్తువులను ఆ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుర తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుర మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు పొరుగున నివసించే వ్యక్తితో ఆ మహిళకు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. మొదటి భర్త పిల్లలను అంగీకరించని అతడు ఆ మహిళను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో దసరా రోజునే తన కవల కుమారులను ఆమె హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

