Watch: కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman hit by car | కారు ఢీకొట్టడంతో ఒక మహిళ గాల్లోకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడింది. (Woman hit by car) అయినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: కారు ఢీకొట్టడంతో ఒక మహిళ గాల్లోకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడింది. (Woman hit by car) అయినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు వేచి ఉంది. ఇంతలో అదుపుతప్పిన ఒక కారు వేగంగా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ గాల్లోకి ఎగిరింది. ఆమె ఉన్న చోటు నుంచి 20 అడుగుల దూరంలో పడింది. ఆ మహిళ తల, భుజాలు, మణికట్టుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
కాగా, ఆ మహిళను అభినయగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌లో క్లర్క్‌గా ఆమె పని చేస్తున్నదని తెలిపారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/TamildiaryIn/status/1785949959755542860?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1785949959755542860%7Ctwgr%5Ec582a5d1d2184b7cef62b3e5f56167ceac31c19e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FTamildiaryIn%2Fstatus%2F1785949959755542860
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

