Viral Video | గ్యాస్ ఆదా చేసేందుకు ఒకే స్టవ్‌పై ఆలూ, పూరీలను కుక్ చేసిన మహిళ
Viral Video : చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్‌కు ఆన్లైన్ అడ్డాగా పలు వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక లేటెస్ట్గా ఓ వీడియోలో మహిళ గ్యాస్‌ను ఆదా చేసేందుకు ఒకే స్టవ్‌పై పూరీ, సబ్జీలను వండిన తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Viral Video : చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్‌కు ఆన్లైన్ అడ్డాగా పలు వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక లేటెస్ట్గా ఓ వీడియోలో మహిళ గ్యాస్‌ను ఆదా చేసేందుకు ఒకే స్టవ్‌పై పూరీ, సబ్జీలను వండిన తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రెషర్ కుక్కర్ లోపల కొన్ని పొటాటోలను బాయిల్ చేస్తున్న విజువల్స్ ఈ క్లిప్‌లో కనిపించాయి.
కుక్కర్‌కు లిడ్ లేకపోవడంతో ఉబికివస్తున్న స్టీమ్‌ను చూడొచ్చు. ఇక ఓపెన్ చేసిన కుకర్పై మరో పాత్రను ఉంచిన మహిళ అందులో పూరీలను తయారుచేస్తుంది. వినూత్న కుకింగ్ ప్రక్రియ ద్వారా పొటాటోలను బాయిల్ చేస్తున్న కుకర్పై మరో పాత్రలో పూరీలను మహిళ తయారుచేయడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. మహిళ కుకింగ్ పద్ధతిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇలా చేయడం అసాధ్యమని ఓ యూజర్ కామెంట్ చేశారు.
నీటిని మరిగించే పాయింట్ 100 డిగ్రీలైతే, వంట నూనె మరిగించే టెంపరేచర్ 300 డిగ్రీలని అంటూ ఇది సాధ్యం కాని పని మరో యూజర్ పేర్కొన్నారు. గ్యాస్‌ను ఆదా చేయడంలో దీటైన మార్గమని..శాల్యూట్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. నేను కూడా ఇలా ప్రయత్నిస్తా అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 74 లక్షల మంది వీక్షించారు.
Read More :
Floyd Mayweather: సిద్ధివినాయక ఆలయానికి మేటి బాక్సర్ ఫ్లయిడ్ మేవెదర్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cooks
- potatoes
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

